NEWSTELANGANA

అరెస్ట్ చేయ‌డం అప్ర‌జాస్వామికం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియ‌స్ అయ్యారు. త‌మ పార్టీకి చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలీసులు ఆయ‌న ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరు దారుణ‌మ‌ని పేర్కొన్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు.

ప్ర‌భుత్వం దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం చేయాలని అడిగితే దాడి చేస్తారా? అని ప్ర‌శ్నించారు కేటీఆర్. ప్రశ్నిస్తే ప్రజా ప్రతినిధులపై కూడా పోలీసులతో దాడులకు తెగబడతారా?
ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా అని నిల‌దీశారు.

శ‌నివారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు కేటీఆర్. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇబ్బందుల‌కు గురి చేయ‌డం వ‌ల్ల‌నే నిల‌దీయాల్సి వ‌స్తోంద‌ని అన్నారు కేటీఆర్. ప్రజలకు మంచి చేయాలని, సంక్షేమం అందించాలని అడిగితే దాడులు చేసే సంస్కృతి తీసుకు రావ‌డం దారుణ‌మ‌న్నారు.

ప్రభుత్వం చేతగాని తనాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న కౌశిక్ రెడ్డి పై రేవంత్ రెడ్డి కక్ష పెంచుకున్నాడని ఆరోపించారు కేటీఆర్. అయితే గుండాలు…లేదంటే పోలీసులతో దాడులు చేయించి భయపెట్టాలని చూస్తున్నాడని ఆరోపించారు.

ప్ర‌భుత్వం, సీఎం మెప్పు కోసం పోలీసులు దాడుల‌కు దిగితే ఎలా అని ప్ర‌శ్నించారు కేటీఆర్.