ప్రభుత్వ సలహాదారుడిగా చాగంటి కోటేశ్వరరావు
కేబినెట్ మంత్రి హోదా కల్పించిన చంద్రబాబు
అమరావతి – ప్రముఖ ప్రవచకర్త, తెలుగు వారి లోగిళ్లలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న చాగంటి కోటేశ్వర్ రావుకు అరుదైన గౌరవం లభించింది. ఆయనకు ఏపీలో కొలువు తీరిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర సర్కార్ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
చాగంటి కోటేశ్వర్ రావుతో పాటు రెండవ జాబితా కింద మొత్తం రాష్ట్రంలోని 59 కార్పొరేషన్లకు చైర్మన్లను, ప్రభుత్వ సలహాదారులను నియమించింది. మైనార్టీ వ్యవహారాలకు సంబంధించి సీనియర్ టీడీపీ నేత షరీఫ్ కు కట్టబెట్టింది.
విద్యార్థులకు ఉపయోగకరంగా, విలువలను పెంపొందించేందుకు గాను చాగంటి కోటేశ్వర్ రావును నియమించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. చాగంటి వ్యక్తి కాదని ఆయన ఓ శక్తి అని, తెలుగు వారిలో ఆధ్యాత్మక రంగం పట్ల ఉత్సుకత పెంపొందించేలా చేస్తున్నారంటూ కితాబు ఇచ్చింది. ఇదిలా ఉండగా చాగంటి నియామకం పట్ల పలువురు ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకారులు సంతోషం వ్యక్తం చేశారు . సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.