హర్షా బోగ్లేకి అరుదైన కానుక
హిస్టరీ ఆఫ్ క్రికెట్ బహూకరణ
హైదరాబాద్ – ప్రపంచంలోనే పేరు పొందిన క్రికెట్ కామెంటర్ , రచయిత , విశ్లేషకుడు హైదరాబాద్ కు చెందిన హర్షా బోగ్లేకు అరుదైన కానుకను అందజేసింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీ ఏ). ఉప్పల్ క్రికెట్ మైదానంలో భారత, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ కీలక మ్యాచ్ లో ప్రత్యర్థి ఇంగ్లండ్ చేతిలో 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
మ్యాచ్ అనంతరం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జగదీశ్వర్ రావు ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఇదే సమయంలో హైదరాబాద్ క్రికెట్ చరిత్రకు సంబంధించిన అరుదైన పుస్తకాన్ని హర్షా బోగ్లేకు బహూకరించారు.
ఈ సందర్బంగా హెచ్ సీ ఏ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ క్రికెట్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉన్నారంటూ హర్షా బోగ్లేను ప్రశంసలతో ముంచెత్తారు. తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
క్రికెట్ బిర్యానీ..ది హిస్టరీ ఆఫ్ హైదరాబాద్ పేరు తో పుస్తకం రాశారు. ఇది ప్రాముఖ్యత పొందింది. భాగ్య నగరంలో క్రికెట్ వారసత్వానికి , లక్షలాది మంది ఆటకు ప్రాణం పోసిన స్వరానికి చిన్న గిఫ్ట్ అంటూ పేర్కొన్నారు.