NEWSANDHRA PRADESH

ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందండి – ప‌వ‌న్ కళ్యాణ్

Share it with your family & friends

నామినేటెడ్ అభ్య‌ర్థుల‌కు డిప్యూటీ సీఎం సూచ‌న

అమ‌రావ‌తి – ఏపీ ఉప ముఖ్య‌మంత్రి కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రెండ‌వ విడ‌త కింద రాష్ట్రంలోని 59 కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌తో పాటు ఇద్ద‌రికీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారులుగా ఎంపిక చేసింది. వీరిలో ఒక‌రు చాగంటి కోటేశ్వ‌ర్ రావు కాగా మ‌రొక‌రు టీడీపీ సీనియ‌ర్ నేత ష‌రీఫ్.

మొత్తం కార్పొరేష‌న్ ప‌ద‌వుల‌లో అత్య‌ధికంగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారికే క‌ట్ట‌బెట్టారు చంద్ర‌బాబు నాయుడు. కొంద‌రికి మాత్రం జ‌న‌సేన పార్టీకి చెందిన నేత‌ల‌కు ఛాన్స్ ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా నామినేటెడ్ కీల‌క ప‌ద‌వులు పొందిన వారు మ‌ర్యాద పూర్వ‌కంగా జ‌న‌సేన పార్టీ చీఫ్ , ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌లుసుకున్నారు.

ఈ సంద‌ర్బంగా వారికి దిశా నిర్దేశం చేశారు . ఎన్నిక‌ల సంద‌ర్బంగా తాను ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని అన్నారు. ప‌ని చేసే వారికి త‌ప్ప‌కుండా ప‌ద‌వులు వ‌స్తాయ‌ని, అలా అని ఎక్క‌డా అధికార ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శించ వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌లు మెచ్చుకునేలా మీరు ప‌ని చేయాల‌ని అన్నారు. లేక పోతే పార్టీకి , త‌న‌కు చెడ్డ పేరు వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. పాల‌నా ప‌రంగా ఏమైనా స‌మ‌స్య‌లు ఉంటే త‌న‌కు చెప్పాల‌ని సూచించారు.