సజ్జల భార్గవ్ రెడ్డిపై కేసు నమోదు
నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద షాక్
కడప జిల్లా – ఏపీలో ప్రభుత్వం మారడంతో ఊహించని రీతిలో వైసీపీ నేతలు, కార్యకర్తలకు బిగ్ షాక్ తగులుతోంది. పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఇంకో వైపు చంద్రబాబు నాయుడు సైతం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ తరుణంలో వైసీపీ బాస్ , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనుంగు అనుచరుడిగా, నమ్మకమైన వ్యక్తిగా, సోషల్ మీడియా ఇంఛార్జ్ గా ఉన్న సజ్జల భార్గవ్ రెడ్డికి కోలుకోలేని షాక్ తగిలింది. తాజాగా సజ్జల భార్గవ్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా సజ్జల భార్గవ్ రెడ్డిపై పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు పోలీసులు. సింహాద్రిపురానికి చెందిన దళిత వ్యక్తి హరి ఫిర్యాదు చేశారని, అందుకే కేసు నమోదు చేయాల్సి వచ్చిందన్నారు పోలీసులు.
దూషణలకు పాల్పడుతున్న వైసీపీ కార్యకర్తలను సజ్జల భార్గవ్ రెడ్డి సమన్వయం చేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా దూషణలు చేసేలే ప్రేరేపిస్తున్నాడని మండిపడ్డారు.
భార్గవ్ రెడ్డితో పాటు మరో ఇద్దరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు చేశామన్నారు పోలీసులు. వైసీపీ సోషల్ మీడియాను నడిపిస్తున్న రాష్ట్రస్థాయి నేత అర్జున్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు . ఇటీవలే పోలీసుల నుంచి తప్పించుకు పారిపోయిన వర్రా రవీందర్ రెడ్డిపై కూడా కేసు చేశామన్నారు.