మతోన్మాదం ప్రమాదకరం – జస్టిస్ కట్టూ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఫైర్
ఢిల్లీ – సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్టూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రోజు రోజుకు మతం పేరుతో విద్వేషాలు, హింసోన్మాదం పెరుగుతోందని రాబోయే రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు .
ప్రధానంగా హిందువులు, ముస్లింల మద్య ద్వేషాన్ని రెచ్చగొట్టడం, మత హింసను వ్యాప్తి చేయడం దారుణమన్నారు. ప్రత్యేకించి మైనార్టీలపై దౌర్జన్యాలు పేట్రేగి పోవడం తనను ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు జస్టిస్ మార్కండేయ కట్టూ.
ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలు ఎక్కువగా మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని, ఇదంతా కేవలం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కొలువు తీరడం వల్లనేనని షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ జస్టిస్.
ప్రధానంగా ప్రధానమంత్రిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మార్కండేయ కట్టూ. ఆయన ఎన్నో సంచలన తీర్పులు ఇచ్చారు. ఆయన రాసిన పుస్తకం విదర్ ఇండియన్ జ్యూడీషియరీలో న్యాయ వ్యవస్థ తీరు తెన్నులపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది ఓ సంచలనంగా మారింది ఈ పుస్తకం.
తాజాగా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్టూ చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.