రేపటి నుంచి ఏం ట్రోల్ చేస్తారో – చంద్రచూడ్
భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి
ఢిల్లీ – మాజీ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై ఎన్ చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పదవీ కాలం పూర్తయింది. ఘనంగా వీడ్కోలు పలికారు జస్టిస్ కు. ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఇటీవల తాను ఎదుర్కొంటున్న ట్రోల్స్ గురించి మరోసారి ప్రస్తావించారు. సరిగ్గా గత నవంబర్ 9, 2022న సీజేఐగా బాధ్యతలు చేపట్టారు.
ఎన్నో సంచలన తీర్పులు ఇచ్చారు. ప్రధానంగా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై ఎన్ చంద్రచూడ్ ఇచ్చిన తీర్పులలో 370 ఆర్టికల్ ను రద్దు చేయడం, 500 ఏళ్లకు పైగా అపరిష్కృతంగా ఉన్న రామ జన్మ భూమితో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారానికి సంబంధించినవి ఉన్నాయి.
తన పదవీ కాలంలో ఎంతో నిజాయితీ కలిగిన ప్రధాన న్యాయూమర్తిగా గుర్తింపు పొందారు. అంతకు మించిన ప్రశంసలు అందుకున్నారు. కానీ ఉన్నట్టుండి గణేశుడి పర్వదినం పురస్కరించుకుని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ స్వయంగా జస్టిస్ చంద్రచూడ్ నివాసానికి వెళ్లడం, ఆయన దీపారాధన చేయడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు.
అంతే కాదు సోషల్ మీడియాలో ఏ సీజేఐ ఎదుర్కోనన్ని ట్రోల్స్ కు గురయ్యారు జస్టిస్ డీవై ఎన్ చంద్రచూడ్. ఇదిలా ఉండగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ట్రోల్ చేసిన వారందరూ రేపటి నుంచి అంటే నవంబర్ 11 సోమవారం నుండి నిరుద్యోగులుగా మారి పోతారేమోనని పేర్కొన్నారు.