NEWSTELANGANA

కుల గ‌ణ‌న‌కు మిశ్ర‌మ స్పంద‌న

Share it with your family & friends

ఎన్యూమ‌రేట‌ర్ల‌కు ఇబ్బందులు

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే ప‌ట్ల మిశ్ర‌మ స్పంద‌న ఎదుర‌వుతోంది. స‌ర్వే ప‌రంగా 70కి పైగా ప్ర‌శ్న‌లు ఉండ‌డం విస్తు పోయేలా చేస్తోంది. ఇప్ప‌టికే ఆధార్ , పాన్ , బ్యాంకు ఖాతాల‌కు సంబంధించి వివ‌రాలు అడ‌గ‌డం వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌కు భంగం క‌లిగించేలా చేస్తుంద‌ని భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం స్ప‌ష్టం చేసింది.

అయినా కాంగ్రెస్ స‌ర్కార్ మొండిగా ముందుకు వెళుతోంది. బీసీల‌ను ఉద్ద‌రిస్తామ‌ని చెబుతోంది. అంద‌రికీ స‌మాన ఫ‌లాలు అందించేందుకే దీనిని చేప‌ట్ట‌నున్న‌ట్లు పేర్కొంటోంది స‌ర్కార్. ఇప్ప‌టికే జిల్లాల‌లో కూడా ఇంటింటి కుటుంబ స‌మ‌గ్ర స‌ర్వే ప్రారంభ‌మైంది.

ఇక హైద‌రాబాద్ లోని న‌గ‌ర వాసుల నుంచి ఎన్యూమ‌రేట‌ర్ల‌కు స‌మాధానం వ‌స్తోంది. ప్ర‌ధానంగా సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కులాల వివరాలను అంచనా వేసేందుకు రూపొందించిన ఈ సర్వేకు సంబంధించిన డేటా సేక‌ర‌ణ‌కు వెళ్లిన వారికి కొన్ని చోట్ల సానుకూల‌త ల‌భించ‌గా చాలా చోట్ల వ్య‌తిరేక‌త వ‌చ్చింది.

సర్వే స్టిక్కర్లను అతికించడానికి ఇంటింటికీ వెళ్లి ప్రాథమిక దశ తర్వాత, ఎన్యుమరేటర్లు సమాచారాన్ని సేకరించడం ప్రారంభించారు. అయినప్పటికీ, కొంత మంది నివాసితులు గోప్యతా ఆందోళనలను ఉటంకిస్తూ పూర్తి వివరాలను అందించడానికి నిరాకరించారు . .

ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో ఎన్యూమరేటర్లకు ప్రతిఘటన ఎదురైంది. నివాసితులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మా ఆస్తుల గురించి మీకు ఎందుకు చెప్పాలంటూ ప్ర‌శ్నించారు.