రెండు వారాల్లో 20 లక్షల సభ్యత్వం
తెలుగుదేశం పార్టీ సభ్యత్వంలో రికార్డ్
అమరావతి – తెలుగుదేశం పార్టీ సంచలనం సృష్టించింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున సభ్యత్వం ప్రారంభం కావడం , రికార్డు స్థాయిని దాటడం విశేషం. ఈ విషయాన్ని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు.
పార్టీ పరంగా సభ్యత్వాలను తీసుకునేందుకు ముందుకు వస్తోందని పేర్కొంది టీడీపీ. కేవలం 2 వారాల్లోనే సభ్యత్వాల నమోదు 20 లక్షలు దాటిందని ఈ క్రెడిట్ సీఎంకే దక్కుతుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ముందు చూపుతో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఎందరో టీడీపీలో సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు మేలు చేకూర్చేలా చేస్తోంది.
రూ. 100 పెట్టి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకుంటే రూ. 5,00,000 ప్రమాద భీమా వర్తిస్తుందని ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోందని తెలిపింది తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల సంక్షేమమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు నారా లోకేష్.
ఇదిలా ఉండగా సభ్యత్వం తీసుకునేందుకు మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చింది టీడీపీ .