చంద్రబాబుకు సుప్రీం ఊరట
ఏపీ సర్కార్ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ – అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. సోమవారం ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. పిటిషన్ ను కొట్టి వేస్తూ తీర్పు చెప్పింది.
ఇదిలా ఉండగా తనపై తప్పుడు కేసు పెట్టిందంటూ చంద్రబాబు నాయుడు పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఏమీ తెలియదని, తన ప్రమేయం లేదని పేర్కొన్నారు. కావాలని రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే తనను అరెస్ట్ చేశారంటూ వాపోయారు టీడీపీ చీఫ్.
ఇదే సమయంలో ఏపీ సీఐడీ మొత్తం చంద్రబాబు నాయుడిపై ఎనిమిది కేసులు నమోదు చేసింది. ప్రధానంగా ఏపీ స్కిల్ స్కామ్ కేసులో బాబును అరెస్ట్ చేసింది. 53 రోజుల పాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ తర్వాత ఏపీ హైకోర్టుకు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు తిరస్కరించింది. దీనిని సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.