నేరస్థులకు కుల మతాలు ఉండవు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం గుంటూరు లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు . నేరస్థులకు కుల మతాలంటూ ఉండవని అన్నారు. వైసీపీ నేతల బెదిరింపులను సీరియస్ గా తీసుకుంటున్నామని అన్నారు. ఒకవేళ గీత దాటాలని ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కో వాల్సి వస్తుందని హెచ్చరించారు పవన్ కళ్యాణ్.
ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డిని ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడును ఉద్దేశించి మాజీ సీఎం బెదిరింపు ధోరణితో మాట్లాడటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై , ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారుల గురించి ఎవరైనా చులకన చేసి మాట్లాడినా లేక వారిపై ఈగ వాలినా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
మీరు ఇంట్లో కూర్చుని రోడ్డు మీద ఆడ బిడ్డలకు సంరక్షణ లేదని విమర్శలు చేయడం దారుణమన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఉన్మాదులు ఎందుకు ఇలా పేట్రేగిపోతున్నారు? గత ప్రభుత్వంలో పాలకులు బాధ్యతా రాహిత్యంగా నోటికి వచ్చిందల్లా మాట్లాడారని మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.