ప్రజలు మెచ్చేలా పని చేయాలి – సీఎం
నామినేటెడ్ పదవులు పొందిన వారికి కంగ్రాట్స్
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నామినేటెడ్ పదవులు పొందిన బాధ్యతగా భావించి ప్రజల కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం వారిని సీఎం అభినందించారు. పోరాటం, కష్టం, త్యాగం, పనితీరు, విధేయత, క్రమశిక్షణ ఆధారంగా పదవులు ఇచ్చామని చెప్పారు.
30 వేల దరఖాస్తులు పరిశీలించి…తగిన వ్యక్తికి తగిన గౌరవం విధానంతో అవకాశం కల్పించామని స్పష్టం చేశారు. వేధింపులకు గురైన వారికి, మహిళలు, యువతకు అవకాశాలు…సమర్థత చాటిన బూత్ స్థాయి కార్యకర్తలకు రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చామన్నారు.
పొలిటికల్ గవర్నెన్స్ లో భాగంగా ఎంపికలు…పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని సూచించారు. నామినేటెడ్ పదవుల మొదటి లిస్టులో 20 చైర్మన్ పోస్టులు, ఒక వైస్ చైర్మన్ పోస్టు భర్తీ చేసిన ప్రభుత్వం…రెండో లిస్టులో ఏకంగా 62 మందికి చైర్మన్ పదవులు, సలహాదారు పదవులు కట్టబెట్టింది.
వీటిలో 60 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు కాగా…క్యాబినెట్ హోదాతో రెండు సలహాదారు పోస్టులు ఉన్నాయి. మీకొచ్చిన పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం పనిచేయాలని అన్నారు చంద్రబాబు నాయుడు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి….పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి అని స్పష్టం చేశారు.