రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్
ఖరారు చేసిన ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ – కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. సోమవారం రాజ్య సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేసింది. దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎంపికకు ఈ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే 56 మంది సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ముందస్తుగా రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీని తర్వాత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ కూడా ఖరారు చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 8న రాజ్య సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అదే నెల 27న పోలింగ్ జరగనుంది.
ఇదిలా ఉండగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తుది గడువు ఫిబ్రవరి 15గా నిర్ణయించింది ఎన్నికల సంఘం. నామినేషన్లను పరిశీలించేందుకు 16వ తేదీ పేర్కొంది. ఇక పోలింగ్ జరిగే రోజే ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తామని ఈసీ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా మొత్తం 56 స్థానాలలో తెలంగాణ నుంచి మూడు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి ఎన్నికలు జరగనున్నాయి.