NEWSINTERNATIONAL

పుతిన్ కు డొనాల్డ్ ట్రంప్ ఫోన్

Share it with your family & friends

ఉక్రెయిన్ తో యుద్దం ఆపండి

అమెరికా – అమెరికా నూత‌న అధ్య‌క్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ దూకుడు పెంచారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్బంగా ఇచ్చిన హామీల మేర‌కు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. దేశంలో ఇప్ప‌టికే అక్ర‌మంగా ఉన్న వ‌ల‌స‌దారుల ఆట క‌ట్టిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఇదే స‌మ‌యంలో ఉక్రెయిన్ పై యుద్దం కొన‌సాగుతుండ‌డంపై ఆరా తీశారు. తాను యుద్దాన్ని కోరుకోవ‌డం లేద‌ని, ఉగ్ర‌వాదుల‌ను ఏరి పారేయ‌డ‌మే తన ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. ఈ సంద‌ర్బంగా ఉక్రెయిన్ పై యుద్దం కొన‌సాగిస్తున్న ర‌ష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్ తో చ‌ర్చ‌లు కొన‌సాగిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు .

ఇందులో భాగంగా రంగంలోకి దిగారు డొనాల్డ్ ట్రంప్. ఈ మేర‌కు ఆయ‌న హాట్ లైన్ ద్వారా ర‌ష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్ తో ఫోన్ లో మాట్లాడారు. ద‌య‌చేసి ఉక్రెయిన్ పై యుద్దం ఆపాల‌ని కోరారు. ఈ మేర‌కు పుతిన్ స‌మ్మ‌తించిన‌ట్లు స‌మాచారం.

ఇక ఉక్రెయిన్ తో యుద్దం పొడిగించ‌వ‌ద్ద‌ని కోర‌డం విశేషం. ఇప్ప‌టికే ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడిన ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ.