అక్రమ అరెస్ట్ లపై రజని ఆందోళన
రాచరిక పాలన సాగిస్తున్న సర్కార్
అమరావతి – ఏపీ మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అన్నది లేకుండా పోయిందని వాపోయారు. ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. విచిత్రం ఏమిటంటే ముందస్తు సమాచారం లేకుండానే అదుపులోకి తీసుకుంటున్నారని, ఎక్కడికి తరలిస్తున్నారో తెలియడం లేదని వాపోయారు.
ప్రతి ఒక్కరికీ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ప్రశ్నించడం అని. దానిని తొక్కి పెట్టాలని అనుకోవడం దారుణమన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు విడుదల రజని. పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
రాత్రికి రాత్రి ఇళ్ళ మీద పడి వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఎత్తుకెళ్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పడం లేదన్నారు… చిత్ర హింసలు పెడుతున్నారని వాపోయారు. ఇది రాక్షస రాజ్యమా అని ప్రశ్నించారు విడుదల రజని. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా ఉంటారని ప్రకటించారు. ఇప్పటికే లీగల్ టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు .