ఆరోగ్యం..వైద్య విద్యకు రూ. 18,421 కోట్లు
కేటాయించినందుకు మంత్రి కృతజ్ఞతలు
అమరావతి – ఏపీ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను 2024-25 సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టింది. ఇదిలా ఉండగా రాష్ట్ర బడ్జెట్ పై ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పందించారు. బడ్జెట్ లో
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య కు రూ. 18,421 కోట్లు కేటాయించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్బంగా సీఎం చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 23 శాతం ఎక్కువ అని పేర్కొన్నారు మంత్రి. పాఠశాల, కళాశాల, ఉన్నత విద్య తర్వాత అత్యధిక బడ్జెట్ ను ఆరోగ్య రంగానికి కేటాయించడం ద్వారా ప్రజారోగ్య సంరక్షణ ప్రాధాన్యతను ఎన్డీయే ప్రభుత్వం తెలియ చేసిందన్నారు సత్య కుమార్ యాదవ్.
ఇదిలా ఉండగా రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు గా పేర్కొన్నారు పయ్యావుల కేశవ్. ఇక శాఖల వారీగా చూస్తే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16.739 కోట్లు, జల వనరులకు రూ.16,705 కోట్లు.. ఉన్నత విద్యకు రూ.2326 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.11490 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యం కోసం రూ.3,127 కోట్లు, ఇంధన రంగానికి రూ.8,207 కోట్లు, పోలీస్ శాఖకు రూ. 8495 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
వీటితో పాటు బీసీ సంక్షేమం కోసం రూ.3,907 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ.4,376 కోట్లు, ఎస్టీ సంక్షేమం కోసం రూ.7,557 కోట్లు, అటవీ పర్యావరణ శాఖకు రూ.687 కోట్లు, గృహ నిర్మాణం కోసం రూ. 4,012 కోట్లు, నైపుణ్యాభివృద్ధి శాఖ కోసం రూ.1,215 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు రెవిన్యూ శాఖ మంత్రి.