రాం గోపాల్ వర్మపై కేసు నమోదు
ఏపీలో కొనసాగుతున్న కేసుల పరంపర
అమరావతి – ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా మద్ది పాడు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు కావడం విశేసం. ఒక చిత్ర నిర్మాణ సమయం లో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అందుకే కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు పోలీసులు.
ఇదిలా ఉండగా గత వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ మోహన్ రెడ్డికి బేషరతుగా మద్దతు ఇచ్చారు రాం గోపాల్ వర్మ. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు బాబు, లోకేష్, పవన్ పై. అంతే కాదు తాను తీసిన చిత్రంలో వారి వ్యక్తిత్వాలను కించ పరిచేలా పాత్రలను చొప్పించారనే ఆరోపణలు ఉన్నాయి.
విచిత్రం ఏమిటంటే రాం గోపాల్ వర్మ బహిరంగంగానే తీవ్ర విమర్శలు, కామెంట్స్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఏపీ సర్కార్ వైసీపీని, ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ తో పాటు జగన్ రెడ్డికి మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేయిస్తోంది.
దీంతో ఏపీలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. తనపై కేసు నమోదు చేయడం పట్ల ఇంకా స్పందించ లేదు దర్శకుడు రాంగోపాల్ వర్మ.