ENTERTAINMENT

ఉల‌గ‌నాయ‌గ‌న్ పేరుతో పిల‌వ‌ద్దు – క‌మ‌ల్ హాస‌న్

Share it with your family & friends

క‌మ‌ల్ హాస‌న్ లేదా క‌మ‌ల్ అని పిల‌వండి

త‌మిళ‌నాడు – త‌మిళ సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సోమ‌వారం ఆయ‌న సుదీర్ఘ లేఖ విడుద‌ల చేశారు. విల‌క్ష‌ణ న‌టుడిగా గుర్తింపు పొందిన ఆయ‌న వ‌య‌సు పెరిగినా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. యువ న‌టుల‌తో పోటీ ప‌డి న‌టిస్తున్నారు.

త‌న‌కు ఎలాంటి బిరుదులు ఆపాదించ వ‌ద్ద‌ని, త‌న‌కు ఇష్టం ఉండ‌ద‌ని ప్ర‌క‌టించారు క‌మ‌ల్ హాస‌న్. ప్ర‌ధానంగా త‌న అభిమానుల‌ను ఉద్దేశించి విడుద‌ల చేసిన లేఖ‌లో ఈ మేర‌కు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తాను బిరుద‌ల‌ను ఇష్ట ప‌డ‌న‌ని తెలిపారు.

అభిమానుల‌తో పాటు ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార‌, డిజిట‌ల్, సోష‌ల్ మీడియాల‌కు కూడా ఇది వ‌ర్తిస్తుందని స్ప‌ష్టం చేశారు క‌మ‌ల్ హాస‌న్. అయితే త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌తో పాటు సినీ అభిమానులు, సినీ రంగానికి చెందిన న‌టీ న‌టులు, సాంకేతిక నిపుణులు, వివిధ రంగాల‌కు చెందిన వారంతా క‌మ‌ల్ హాసన్ ను ఉల‌గ‌నాయ‌గ‌న్ అని పిలుచుకుంటారు.

ఈ సంద‌ర్బంగా ఉల‌గ‌నాయ‌గ‌న్ పేరుతో పిల‌వ వ‌ద్ద‌ని దానికి బ‌దులుగా క‌మ‌ల్ హాస‌న్ , క‌మ‌ల్ లేదా కేహెచ్ అని పిల‌వాల‌ని కోరారు క‌మ‌ల్ హాస‌న్.