NEWSANDHRA PRADESH

మేం గేట్లు తెరిస్తే వైసీపీ ఖ‌తం

Share it with your family & friends

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు. సోమ‌వారం రా క‌ద‌లిరా బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు. తాము త‌ల్చుకుంటే వైసీపీ ఉండ‌ద‌న్నారు. త‌మ పార్టీలోకి రమ్మని పిలుపునిస్తే, గేట్లు తెరిస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుంద‌న్నారు చంద్ర‌బాబు నాయుడు.

రాష్ట్రాన్ని అప్పులు కుప్ప‌గా మార్చిన ఘ‌నుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. రాబోయేది టీడీపీ, జ‌న‌సేన సంకీర్ణ స‌ర్కారేన‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. జ‌గ‌న్ రెడ్డికి రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయ‌ని, ఇక ఆయ‌న ఇంటికి వెళ్ల‌డం ఖాయ‌మ‌న్నారు.

ఇవాళ త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసి, కేసులు న‌మోదు చేసి జైలు పాలు చేసినా చివ‌ర‌కు సుప్రీంకోర్టు మెట్టి కాయ‌లు వేసింద‌న్నారు. త‌న‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని అన్నారు చంద్ర‌బాబు నాయుడు. ఇవాళ ప్ర‌జ‌లంతా త‌మ వైపు ఉన్నార‌ని, రాక్ష‌స పాల‌న వ‌ద్ద‌ని అనుకుంటున్నార‌ని , చుక్క‌లు చూపించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు.

ప్ర‌జ‌లు ఎంత కాలం స‌హిస్తార‌ని, ఇక ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.