NEWSTELANGANA

వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ పై దాడి

Share it with your family & friends

ఉరికించి కొట్టిన గ్రామ‌స్థులు

వికారాబాద్ జిల్లా – సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌తీక్ జైన్ పై గ్రామ‌స్థులు దాడికి పాల్ప‌డ్డారు. దీంతో ఉద్రిక్త‌త నెల‌కొంది ల‌గ‌చ‌ర్ల‌ గ్రామంలో. భారీ ఎత్తున పోలీసు బ‌ల‌గాలు అక్క‌డికి చేరుకున్నాయి. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సంబంధించి అభిప్రాయ సేక‌ర‌ణ చేసేందుకు అక్క‌డికి వెళ్లారు ప్ర‌తీక్ జైన్. కోడంగ‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీ చైర్మ‌న్ గా ఉన్నారు జైన్. ఆయ‌న‌తో పాటు ప‌లువురు అధికారులు అక్క‌డికి చేరుకున్నారు.

వారు రావ‌ద్దంటూ, త‌మ‌కు ఫార్మా కంపెనీ అవ‌స‌రం లేదంటూ సీఎంకు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఘ‌ట‌న దుద్యాల మండ‌లం ల‌గ‌చ‌ర్ల‌లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం కలిగించింది. ఇదే స‌మ‌యంలో జిల్లా క‌లెక్ట‌ర్ తో పాటు ఇత‌ర అధికారుల‌కు చెందిన వాహ‌నాల‌ను ధ్వంసం చేశారు. రాళ్లు, క‌ట్టెల‌తో దాడికి య‌త్నించారు.

గ‌తంలో ఈ ల‌గ‌చ‌ర్ల ఊరు బొంరాస్ పేట మండ‌లంలో ఉండేది. ప్ర‌స్తుతం దుద్యాల మండ‌ల ప‌రిధిలోకి వ‌చ్చింది. ఇక్క‌డ 1700 ఎక‌రాల‌లో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయాల‌ని ప్రభుత్వం నిర్ణ‌యించింది. ఈ కంపెనీ సీఎం అల్లుడికి చెందిన‌ద‌ని స‌మాచారం.