చంద్రబాబూ నీతి సూక్తులు చెప్పకు
నిప్పులు చెరిగిన సీపీఐ నారాయణ
అమరావతి – సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుపై. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చూసి ధైర్యం తెచ్చుకో అంటూ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నువ్వు జైలుకు వెళ్లి వచ్చావు. ఇంకా 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటూ చెప్పు కోవడం మంచి పద్దతి కాదన్నారు.
పదవుల కోసం పార్టీలు మార్చే పద్దతిని మార్చుకోక పోతే జనం ఛీకొట్టే రోజు తప్పకుండా వస్తుందన్నారు. అయినా నీకు నీతి సూక్తులు దేని కోసం అంటూ ప్రశ్నించారు సీపీఐ నారాయణ. కేసుల నుంచి బయట పడేందుకే నువ్వు భారతీయ జనతా పార్టీతో కలిసి తిరుగుతున్నాయని ఆరోపించారు. లేక పోతే ఎవరినీ దగ్గరకు రానీవ్వవని పేర్కొన్నారు .
కేవలం బెయిల్స్ మీదనే ఇన్నాళ్ల పాటు నెగ్గుకుంటూ వచ్చావని, ఈ సంగతి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసని అన్నారు. ఇలాంటి అవకాశవాద రాజకీయాలు ఇక నుంచి చేయొద్దంటూ హితవు పలికారు నారాయణ.