లగచర్ల గ్రామస్తులను ఏమీ అనొద్దు
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
హైదరాబాద్ – దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాకు చెందిన కలెక్టర్ ప్రతీక్ జైన్. ఆయన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గ పరిధిలోని దుద్యాల మండలానికి చేరుకున్నారు.
అక్కడ ఏర్పాటు చేయబోయే ఫార్మా కంపెనీ గురించి గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ లగచర్ల గ్రామస్తులు పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. తమ భూములు ఎవరికీ ఇచ్చే ప్రసక్తి లేదని ప్రకటించారు. సీఎం కానీ ఆయన తరపున ఎవరు వచ్చినా తాము ఊరుకునే ది లేదని హెచ్చరించారు.
అంతే కాకుండా కలెక్టర్ తో పాటు అక్కడికి వెళ్లిన కోడంగల్ డెవలప్ మెంట్ అథారిటీ (కుడా) ఆఫీసర్ వెంకట్ రెడ్డిని ఉరికించి కొట్టారు. అంతటితో ఆగకుండా ఎమ్మార్వో విజయ్ కుమార్ పై దాడికి దిగారు. అడ్డం వచ్చిన కలెక్టర్ ప్రతీక్ జైన్ ను నెట్టి వేసే ప్రయత్నం చేశారు.
వాహనాలను ధ్వంసం చేశారు. రాళ్లు, కట్టెలతో దాడికి యత్నించారు. ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచురణ, ప్రసార, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో వికారాబాద్ కలెక్టర్ పై దాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఆందోళన చేపట్టిన వారిని సముదాయించారు. తనపై దాడి జరగలేదని, గ్రామస్తులు తమ బాధను వ్యక్తం చేశారని ఈ సందర్బంగా అన్నారు ప్రతీక్ జైన్.