ఏపీ డిప్యూటీ సీఎంతో బీఆర్ నాయుడు భేటీ
శ్రీవారి ప్రసాదం అందజేసిన టీటీడీ చైర్మన్
అమరావతి – తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమితులైన టీవీ5 వ్యవస్థాపకుడు, అధిపతి బీఆర్ నాయుడు మంగళగిరి లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు . ఆయనకు శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.
కాగా ఇటీవలే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చైర్మన్ తో పాటు 24 మంది సభ్యులను నియమించింది. ఇటీవలే చైర్మన్ తో పాటు మిగతా సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ప్రత్యేకంగా బీఆర్ నాయుడును అభినందించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి.
చైర్మన్ తో పాటు సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలని స్పష్టం చేశారు కొణిదల పవన్ కళ్యాణ్.
అంతకు ముందు సీఎం నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు . ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు. ఇద్దరూ కొద్దిసేపు వివిధ అంశాలపై చర్చించారు. తిరుమలలో పవిత్రతను కాపాడాలని సూచించారు ఏపీ ముఖ్యమంత్రి.