ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు
నిప్పులు చెరిగిన చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఆయన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్ తో పాటు సీఎం, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జగన్ మోహన్ రెడ్డి రాక పోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు.
ఒక బాధ్యత కలిగిన నాయకుడు ఇలాగేనా వ్యవహరించేది అంటూ మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు చేయడంపై ఉన్నంత శ్రద్ద ప్రజా సమస్యలను ప్రస్తావించే వేదిక అసెంబ్లీకి రాక పోవడం దారుణమన్నారు. జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు క్షమించరని అన్నారు.
రాజకీయాలు వేరు..కానీ ప్రజా దేవాలయంగా భావించే శాసన సభకు రాకుండా ఉండడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. అయినా ఎవరు వచ్చినా రాకున్నా ఒకరి కోసం అసెంబ్లీ ఆగదన్నారు. అది కొనసాగుతూనే ఉంటుందన్నారు నారా చంద్రబాబు నాయుడు.
ప్రజా సమస్యలపై బాధ్యతాయుతమైన చర్చ జరపడం సభ్యుల బాధ్యత అని స్పష్టం చేశారు. 1995లో తెల్లవారుజామున 4 గంటలకు ముందు రోజు రాత్రి భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయని ఈ సందర్బంగా గుర్తు చేశారు ఏపీ సీఎం. ఎమ్మెల్యేలు పూర్తి డేటాతో రావాలని సూచించారు. సభను సీరియస్ గా తీసుకోవాలన్నారు. చీఫ్ విప్, విప్ లను ఖరారు చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు.