NEWSANDHRA PRADESH

ప‌తాక స్థాయికి తీసుకు వెళ్లేలా బ‌డ్జెట్

Share it with your family & friends

హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌

అమ‌రావ‌తి – రాష్ట్రాన్ని పతన స్థాయి నుంచి పతాక స్థాయికి తీసుకెళ్లే విధంగా బడ్జెట్ ఉంద‌న్నారు రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. బడ్జెట్ లో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇవ్వ‌డం జరిగింద‌న్నారు.

వికసిత భారత్ లో రాష్ట్ర భాగస్వామ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దార్శనికతకు బడ్జెట్ కేటాయింపులే నిదర్శనం అన్నారు. బడ్జెట్ కేటాయింపులతో పోలీస్ శాఖకు పూర్వ వైభవం రానుంద‌ని చెప్పారు వంగ‌ల‌పూడి అనిత‌.

రూ.2.94 లక్షల కోట్ల బడ్జెట్ లో ప్రతి రంగానికి సమపాళ్లలో కేటాయింపులు జరిగాయన్నారు. అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే వెనుకబడిన వర్గాలైప ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం కోసం సుమారు 23 శాతం బడ్జెట్ నిధులు కేటాయింపుతో ఆయా వర్గాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయడమేనన్నారు.

రాష్ట్ర జీఎస్డీపీలో 40 శాతానికి పూగా వాటా ఉన్న వ్యవసాయం అనుబంధ రంగాలకు రూ.43,402 కోట్లు కేటాయించి రైతు సంక్షేమ ప్రభుత్వం అన్న పేరుకు సార్థకత చేకూరిందన్నారు. విద్య, వైద్య, ఇరిగేషన్, పంచాయతీరాజ్, నైపుణ్య రంగంతో పాటు గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధితో పాటు రాష్ట్ర రాహదారుల కోసం సింహభాగం ఖర్చు చేయాలని భావించడం ముఖ్యమంత్రి దార్శనికతకు నిదర్శనమన్నారు.

గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అధోగ‌తి పాలు చేసిన వైఎస్సార్సీపీ నేతలు ఇప్పుడు మొహం చాటేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఎంతో కీలకమైన బడ్జెట్ సమావేశాలకు కూడా రాకుండా తమ భాద్యతా రాహిత్యాన్ని బహిర్గతం చేశారన్నారు.