విద్య..వైద్యానికి పెద్దపీట – సత్య కుమార్ యాదవ్
జన రంజక బడ్జెట్ ప్రవేశ పెట్టామన్న మంత్రి
అమరావతి – ఏపీ కూటమి ప్రభుత్వం జన రంజక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిందని అన్నారు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. బడ్జెట్ పై ఆయన స్పందించారు. ప్రధానంగా వైద్య విద్య, ఆరోగ్య రంగానికి అత్యధికంగా నిధులు కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
అంతే కాకుండా విద్యా రంగానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సత్య కుమార్ యాదవ్. తమ ప్రభుత్వం పూర్తిగా సంక్షేమమే లక్ష్యమంగా ముందుకు సాగుతుందని అన్నారు. మంత్రి మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వం పూర్తిగా ఆయా రంగాలను విస్మరించిందని ఆరోపించారు. కానీ కూటమి సర్కార్ పాఠశాల విద్య కోసం రూ. 29,909 కోట్లు , ఆరోగ్య రంగానికి రూ. 18,421 కోట్లు, పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్దికి సంబంధించి రూ. 16,739 కోట్లు, నీటి పారుదల రంగానికి రూ. 16,705 కోట్లు కేటాయించడం మామూలు విషయం కాదన్నారు సత్య కుమార్ యాదవ్.
సీఎం నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదెలకు, పూర్తి సహకారం అందించిన ప్రధాని నరేంద్ర మోడీకి, బడ్జెట్ రూప కల్పన చేయడంలో కీలక పాత్ర పోషించిన సహచర మంత్రి పయ్యావుల కేశవ్ కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి.