NEWSTELANGANA

సేంద్రీయ వ్య‌వ‌సాయం పెర‌గాలి

Share it with your family & friends

మ‌రికంటి భ‌వానీ రెడ్డి రైతుల‌కు పిలుపు

హైద‌రాబాద్ – ప‌రుగులు మందులు లేని స‌హ‌జ సిద్ద‌మైన వ్య‌వ‌సాయం మ‌రింత పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు తెలంగాణ రాష్ట్ర వ్య‌వసాయ క‌మిష‌న్ స‌భ్యురాలు మ‌రికంటి భ‌వానీ రెడ్డి. తెలంగాణ డెవ‌ల‌ప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆధ్వ‌ర్యంలో మ‌ర్రిగూడ‌లో సహజ వ్యవసాయంపై అవగాహన, శిక్షణ సదస్సు ఏర్పాటు చేశారు.

ఈ సద‌స్సులో అనుభవజ్ఞులైన సేంద్రియ రైతులు వ‌ర ప్ర‌సాద్ రెడ్డి, బీరెడ్డి నరేష్ రెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ నరసింహారెడ్డి, ఇందిరా , నరేంద్ర రెడ్డి రైతులకు సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ ఇవ్వ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు.

ఆధునిక పద్ధతుల ద్వారా సేంద్రియ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడం వ‌ల్ల రైతుల‌కు మ‌రింత ప్ర‌యోజనం క‌లుగుతుందన్నారు మ‌రికంటి భ‌వానీ రెడ్డి. అలాగే యువత వ్యవసాయం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.

రైతులకు ఉచితంగా సేంద్రియ ఎరువులు అందిస్తున్న విశ్వ ఆగ్రో టెక్ కంపెనీ సీఈవో బైరి సుభాష్ ను, కంపెనీ సేల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజును టీడీఎఫ్ త‌ర‌పున అభినంద‌న‌లు తెలియ చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా సహజ వ్యవసాయం చేస్తున్న ఉత్తమ రైతులతో శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. ఎల్‌ఈడీ స్క్రీన్‌పై బొమ్మలు, వీడియోలు ప్లే చేస్తూ రైతులకు ఆధునిక పద్ధతిలో శిక్షణ ఇచ్చారు.

శిక్షణ శిబిరానికి వచ్చిన రైతులకు సహజ వ్యవసాయం ఎలా చేయాలి? మీరు ఎందుకు చేయాలి? చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? విషయం ఏంటనేది వివరించారు. రసాయన మందులు వాడకుండా సహజ వ్యవసాయం ఎలా చేయాలో తెలియజేశారు.

పెట్టుబడి లేకుండా సహజ వ్యవసాయ పద్ధతి “జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్” గురించి ఉత్తమ రైతులు అనేక విషయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో 500 మంది రైతులు పాల్గొన్నారు.