NEWSANDHRA PRADESH

ప‌ట్ట‌ణాభివృద్దికి పెద్ద‌పీట – నారాయ‌ణ

Share it with your family & friends

సిద్దార్థ ఫ్లై ఓవ‌ర్ ప్రారంభోత్స‌వంలో మంత్రి

అమ‌రావ‌తి – ప‌ట్ట‌ణాభివృద్దిపై త‌మ కూట‌మి ప్ర‌భుత్వం దృష్టి సారిస్తుంద‌ని చెప్పారు ఏపీ ప‌ట్ట‌ణ‌, పుర‌పాలిక శాఖ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌. కానూరు లో సిద్ధార్థ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్ర‌సంగించారు.

ఫ్లై ఓవర్‌ను స్వయంగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు పొంగూరు నారాయ‌ణ‌. గత ప్రభుత్వంలో ఆర్థిక అవ్యవస్థ, మున్సిపాలిటీల పన్నుల నిధుల దుర్వినియోగం అయ్యాయ‌ని ఆరోపించారు.

ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. 2019, 2020లో అమృత, స్వచ్ఛ భారత్ పథకాల కింద కేంద్ర నిధులు విడుదల అయ్యుంటే డ్రైనేజీ, తాగునీటి సమస్యలు పరిష్కారం అయ్యేవ‌ని అన్నారు.

తాడిగడప మున్సిపాలిటీలో డ్రెయిన్లు దారుణ స్థితిలో ఉన్నాయని , త్వరలోనే అన్ని డ్రెయిన్లు మెరుగు పరుస్తానని హామి ఇచ్చారు పొంగూరు నారాయ‌ణ‌.

ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు పాల్గొన్నారు.