ట్రంప్ టీంలోకి వివేక్ రామస్వామి
పాలనా విభాగంలో కీలక పాత్ర
అమెరికా – ప్రవాస భారతీయుడైన వివేక్ రామస్వామి కీలకంగా మారనున్నారు. అమెరికాలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశ నూతన అధ్యక్షుడిగా రెండవసారి కొలువు తీరనున్నారు డొనాల్డ్ ట్రంప్. ఆయన టీంలో ప్రవాస భారతీయులు ఇద్దరు ప్రధాన పాత్ర పోషించనున్నారు. వారిలో ఒకరు కాశ్యప్ పటేల్ కాగా మరొకరు వివేక్ రామస్వామి.
ఈ ఇద్దరు కూడా ప్రవాస భారతీయులే కావడం విశేషం. ప్రస్తుతం ట్రంప్ రావడంతో భారత్ కు కూడా ఒక రకంగా ఇబ్బంది కలిగినా మరో రకంగా ఆయన మద్దతుగా నిలిచారు. ట్రంప్ గెలవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
విశ్వసనీయ సమాచారం మేరకు వివేక్ రామస్వామికి కీలకమైన పదవి దక్కబోతోంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీలో డైరెక్టర్ గా ట్రంప్ ఇవ్వనున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ఇమ్మిగ్రేషన్ పాలసీకి సంబంధించిన వివరాలను అమలు చేయడం, రూపొందించే బాధ్యతను ఆయన చూసుకోనున్నారు.
తాజాగా దేశంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో బైడెన్ సర్కార్ పై, కమలా హారీస్ పై నిప్పులు చెరిగారు. ట్రంప్ కు బేషరతుగా మద్దతు ప్రకటించాడు. ట్రంప్ కోసం కష్టపడిన వారిలో ఒకరు ఎలాన్ మస్క్ కాగా మరొకరు వివేక్ రామస్వామి.