NEWSANDHRA PRADESH

జ‌గ‌న‌న్నా నీకిది త‌గునా..?

Share it with your family & friends

ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల

అమ‌రావ‌తి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. త‌న సోద‌రుడు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీకిది భావ్య‌మేనా అంటూ నిల‌దీశారు. మిమ్మల్ని గెలిపించింది ప్రజలు. మీకు భాధ్యత లేదా..? ప్రతిపక్ష హోదా లేకపోతే మైకు ఇవ్వరని చెబుతున్నారు. మైకు ఇవ్వక పోవడం మీ స్వయం కృతాపారధం అని అన్నారు.

ఒకప్పుడు 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 11 సీట్లు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు..? మీ అక్రమాలను, అవినీతిని ప్రజలు గమనించారు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారు. మీకు ప్రజల తీర్పు మీద గౌరవం ఉండాలి కదా. అసెంబ్లీకి పోను అనడం మీ అహంకారం, అజ్ఞానానికి నిదర్శనం అన్నారు.

దీనిపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలను అడుగుతున్నాం. మీకు ప్రజలు ఓట్లు వేశారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ అసెంబ్లీ. మీకు ఆలోచన లేదా..? ప్రజలు మీకు ఓట్లు వేసింది అసెంబ్లీ వెళ్ళడానికి కదా.

అసెంబ్లీకి పోకుంటే మీరు ప్రజలను వెన్నుపోటు పొడిచినట్లు కాదా ? ప్రజలను మోసం చేసినట్లు కాదా..? జగన్‌కి అంటే అహంకారం ఉంది. మీకు ఏమయ్యిందంటూ ప్ర‌శ్నించారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఇంట్లో కూర్చొని మాట్లాడటానికి కాదు కదా ప్రజలు మీకు ఓట్లు వేసింది..? మీ అజ్ఞానం ఏంటో బయటపడింది. వైసీపీ ఎమ్మెల్యేలకు ఇది భావ్యం కాదన్నారు.

బడ్జెట్ ప్రవేశ పెడుతుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఎవరు..? ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేది ఎవరు..? సర్కార్ దందాలను ప్రశ్నించేది ఎవరు..? ఎన్నికల్లో నిలబడ్డప్పుడు అసెంబ్లీకి పోను అని మీరు చెప్పారా..? మీకు దైర్యం సామర్థ్యం లేకుంటే రాజీనామా చేయండని అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలకు లేఖ రాస్తున్నాం. మీరు అసెంబ్లీకి వెళ్ళకుంటే రాజీనామాలు చేయండి. లేదంటే స్వతంత్ర అభ్యర్థులుగా అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యలను లేవనెత్తండి అని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామ‌ని పేర్కొన్నారు వైఎస్ ష‌ర్మిల.