NEWSANDHRA PRADESH

ఏపీలో రిల‌య‌న్స్ భారీ పెట్టుబ‌డి

Share it with your family & friends

రూ. 65,000 కోట్ల బిగ్ ఇన్వెస్ట్ మెంట్

అమ‌రావ‌తి – భార‌త దేశంలో ప్ర‌ముఖ వ్యాపార దిగ్గ‌జ సంస్థ రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇందులో భాగంగా ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో సుదీర్ఘంగా చ‌ర్చించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వంతో రియ‌ల‌న్స్ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఈ మేర‌కు రాష్ట్రంలో రూ. 65,000 కోట్లు పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. వ‌చ్చే ఐదేళ్ల‌లో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్‌లను నెలకొల్ప‌నుంది.

రిలయన్స్ ఇండ‌స్ట్రీస్ ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో భారీ ఎత్తున ఇన్వెస్ట్ మెంట్ చేయ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. దీని ద్వారా దాదాపు 250,000 ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.

క్లీన్ ఎనర్జీ కింద ఆర్ఐఎల్ కోసం గుజరాత్ వెలుపల ఇది అతిపెద్ద పెట్టుబడి. చంద్రబాబు నాయుడు విజనరీ ఆలోచనతో తెచ్చిన, కొత్త క్లీన్ ఎనర్జీ పాలసీతో, ఏపీలో భారీ పెట్టుబడులకు త‌మ‌ రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చిందని ప్ర‌క‌టించింది.