NEWSANDHRA PRADESH

స్పీక‌ర్ నైనా ఇంకా నేర్చుకుంటున్నా

Share it with your family & friends

చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు

అమ‌రావ‌తి – ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను స్పీక‌ర్ నైనా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాన‌ని అన్నారు. త‌ను రాజ‌కీయాల్లోకి వ‌చ్చి 40 ఏళ్లు అవుతోంద‌న్నారు.
అసెంబ్లీలో స్పీకర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వర్క్ షాప్ నిర్వ‌హించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వర్క్ షాప్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ప్ర‌తి రోజూ రాజ‌కీయాల గురించి ఎంతో నేర్చుకుంటూనే ఉన్నాన‌ని చెప్పారు ఏపీ స్పీక‌ర్. ఇంకా నేర్చు కోవాల్సిన‌వి చాలా ఉన్నాయ‌ని అన్నారు.

ఇప్పుడు మొదటి సారి ఎమ్మెల్యేలైన వారికి ఈ వర్క్ షాప్ ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. అసెంబ్లీ రూల్స్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. సభలో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలుసు కోవాల‌ని సూచించారు.

రోజుకి పది ప్రశ్నలకే సమయం సరిపోతుందని అన్నారు ఏపీ స్పీక‌ర్.