సీఎం ఇలాఖాలో ఇంటర్నెట్ బంద్
వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం లేకుండా పోయింది. పూర్తిగా ఇంటర్నెట్ ను బంద్ చేయడంతో విస్మయానికి గురయ్యా ఆ నియోజకవర్గ ప్రజలు.
నేటి యుగంలో, ఏదైనా పౌర సమాజంలో ఇంటర్నెట్ షట్డౌన్ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రత్యక్ష ముప్పుగా పరిగణించ బడుతుంది.
ఇది కాశ్మీర్‌లో లేదా ఏదైనా ఉత్తరాది రాష్ట్రంలో జరిగినప్పుడు ఇది హెడ్ లైన్‌గా మారుతుంది,తెలంగాణలో జరిగినప్పుడు ఇది ఫుట్ నోట్‌గా ఉంటుంది.
సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో నిన్న రాత్రి నుంచి ఇంటర్నెట్ బంద్ అయింది. అలాగే , దుద్వాల్, బొంరాస్ పేట మండలాల్లోనూ కూడా నెట్ కనెక్టివిటీ లేకుండా పోయింది. ఇప్పటికే ఆదిలాబాద్‌లోని జైనూర్ మండలంలో సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఇంటర్నెట్ సేవలను నిలిపి వేశారు.
కొడంగల్‌లో వచ్చే ఫార్మా విలేజ్‌ను నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. బీఆర్‌ఎస్ హయాంలోనే ఫార్మా సిటీ కోసం భూమిని సేకరించారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఫార్మా సిటీని ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. దీంతో గ్రామస్తులు ఉలిక్కి పడ్డారు. జిల్లా కలెక్టర్‌పై గ్రామస్తులు నిన్న దాడి చేశారు.
ప్రజల ఆగ్రహాన్ని అంచనా వేయడంలో ఇంటెలిజెన్స్ , ప్రభుత్వ వైఫల్యం కాదా? మరీ ముఖ్యంగా, ప్రజల ఆగ్రహం వచ్చినప్పుడల్లా ప్రభుత్వం ఇంటర్నెట్‌ను ఆపి వేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.