రిలయన్స్ తో ఒప్పందం బాబు సంతోషం
రూ. 65,000 కోట్ల పెట్టుబడి భారీగా ఉద్యోగాలు
అమరావతి – రిలయన్స్ గ్రూప్ సంస్థ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏకంగా రూ. 65,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ సందర్బంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు.
కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్రాజెక్ట్‌ల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు స్పష్టం చేశారు బాబు.
ఈ అరుదైన భాగస్వామ్యం వల్ల మన రాష్ట్రంలో 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
రిలయన్స్ జాతీయ లక్ష్యం 2,000 CBG ప్లాంట్లలో, 500 అత్యాధునిక CBG ప్లాంట్లు వచ్చే మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ అంతటా నిర్మించడం జరుగుతుందని తెలిపారు.. ఇది స్వచ్ఛమైన ఇంధనం , స్థిరమైన అభివృద్ధిలో మన రాష్ట్రాన్ని అగ్రగామిగా చేస్తుందనడంలో సందేహం లేదన్నారు.
జీవనోపాధిని మెరుగు పరచడానికి రిలయన్స్ నిబద్ధతతో, ఈ భాగస్వామ్యం బహుళ రంగాలలో వృద్ధిని కూడా పెంచుతుందని అన్నారు. పరివర్తనాత్మక పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ మన రాష్ట్రాన్ని పరిశ్రమలకు ప్రాధాన్య గమ్యస్థానంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఇది ఏపీ రాష్ట్రానికి మరింత అనుకూలంగా ఉంటుందన్నారు.