NEWSANDHRA PRADESH

108 వ్య‌వ‌స్థ‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపాలి

Share it with your family & friends

ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి డిమాండ్

అమ‌రావ‌తి – దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తీసుకు వ‌చ్చిన 108 వ్య‌వ‌స్థ‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ఆరోపించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. అపర సంజీవని 108 అంబులెన్స్ లకు కూటమి ప్రభుత్వంలో ఆపద వచ్చి పడిందన్నారు.

ఫోన్ కొడితే కుయ్ కుయ్ మంటూ క్షతగాత్రుల వద్దకు చేరే ఆరోగ్య ప్రదాయిని మూగ బోతుందన్నారు. అత్యవసర పరిస్థితిలో ప్రాణాలకు అండగా నిలిచే అంబులెన్స్ వ్యవస్థను ప్రతీకార రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు.

వాహనాల్లో డీజిల్ పోయకుండా, మెడికల్ ఏక్యూప్మెంట్ సమకూర్చకుండా, రిపేర్లు వస్తే చేయించకుండా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ధ్వ‌జ‌మెత్తారు. ఇంధనం లేదని గత నెల 140 వాహనాలు ఆపడం ఏంటి ? 90 వాహనాలు ఇప్పటికీ రిపేర్లు ఉన్నా పట్టించుకు పోవడం ఏంటి ? మహానేత YSR మానస పుత్రిక 108 అంబులెన్స్. YSR దూర దృష్టికి నిదర్శనం అన్నారు.

దేశంలో ఎన్నో రాష్ట్రాలకు 108 వ్యవస్థ ఆదర్శంగా ఉంద‌న్నారు. లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన సంజీవని. ఇలాంటి వ్యవస్థకు ప్రభుత్వాలు మారినప్పుడల్లా గ్రహణం పడుతోందన్నారు. ఇదిలా ఉండ‌గా 108 ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధులు త‌న‌ను క‌లిసిన సంద‌ర్బంగా ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.