NEWSTELANGANA

క‌లెక్ట‌ర్ పై దాడి కేసులో ప‌ట్నం కీల‌కం

Share it with your family & friends

ఐజీ స‌త్య నారాయ‌ణ వెల్ల‌డి

హైద‌రాబాద్ – ఐజీపీ వి. స‌త్య నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌తీక్ జైన్ పై ల‌గ‌చ‌ర్ల గ్రామ‌స్థులు జ‌రిపిన దాడిలో కీల‌క‌మైన వ్య‌క్తిగా మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డిని గుర్తించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. అందుకే ఆయ‌న‌ను అద‌పులోకి తీసుకున్న‌ట్లు చెప్పారు.

ఈ కేసుకు సంబంధించి ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డిని ఏ1గా చేర్చామ‌న్నారు ఏజీపీ. ప‌క్కా ప్లాన్ ప్ర‌కార‌మే ఈ దాడి జ‌రిగింద‌ని తెలిపారు. దాడి ఘ‌ట‌న‌లో కీల‌క‌మైన పాత్ర పోషించాడ‌ని చెప్పారు . ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డిన కేసు విష‌యంపై విచార‌ణ జ‌రిపేందుకు గాను క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని కోరామ‌న్నారు వి. స‌త్య నారాయ‌ణ‌.

కేసుకు సంబంధించి రేపు కోర్టులో వాద‌న‌లు జ‌రుగుతాయ‌ని తెలిపారు. దాడి ఘ‌ట‌న‌కు సంబంధించి అరెస్ట్ చేసిన 42 మందిలో 19 మందికి భూమి లేద‌న్నారు. ప‌క్కా ప్లాన్ ప్ర‌కార‌మే దాడి చేయాల‌ని స్కెచ్ వేశార‌ని, ఆ మేర‌కు దాడి జ‌రిగింద‌న్నారు.

ఈ మొత్తం వ్య‌వ‌హారంపై పూర్తిగా విచార‌ణ కొన‌సాగుతోంద‌ని చెప్పారు. ఇందులో ఎవ‌రు ఉన్నా వారిని వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌ని ప్ర‌క‌టించారు ఐజీపీ వి. స‌త్య‌నారాయ‌ణ‌.