తిరిగి వీఆర్వో..వీఆర్ఏ వ్యవస్థ
ప్రకటించిన మంత్రి పొంగులేటి
హైదరాబాద్ – రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ రద్దు చేసిన రెవెన్యూ వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను తిరిగి పునరుద్దరిస్తామని వెల్లడించారు. ఆయన చేసిన ప్రకటన కలకలం రేపుతోంది.
గతంలో ఒకరి భూమి పేరును ఇంకొకరి పేరును ఎక్కిస్తూ తీవ్రమైన అవినీతి, ఆరోపణలు ఎదుర్కొన్నారు వీఆర్వో, వీఆర్ఏలు. అయితే అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ కేసీఆర్ ప్రభుత్వం ధరణిని తీసుకు వచ్చింది. అయితే ఇది వచ్చాక భారీ ఎత్తున విలువైన ప్రభుత్వ భూములు చేతులు మారాయనే విమర్శలు ఉన్నాయి.
కేసీఆర్ హయాంలో రద్దు చేసిన రెవెన్యూ వ్యవస్థను తిరిగి తీసుకు రాబోతున్నట్లు ప్రకటన చేయడంతో రెవెన్యూ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. పాలనా పరంగా వీరు గ్రామాల అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మొత్తంగా ఆయా శాఖలలో చోటు చేసుకున్న బాగోతాలను, స్కామ్ లను వెలికి తీసే పనిలో పడింది రేవంత్ రెడ్డి సర్కార్.