ఉత్కంఠ భ‌రితంగా ‘పోలీస్ కంప్లైంట్’ టీజ‌ర్

వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్, న‌వీన్ చంద్ర‌ కీ రోల్

హైద‌రాబాద్ : సంజీవ్ మేగోటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్, న‌వీన్ చంద్ర కీ రోల్ పోషించిన పోలీస్ కంప్లైంట్ మూవీ టీజ‌ర్ హైద‌రాబాద్ లో ఘ‌నంగా రిలీజ్ అయ్యింది. ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు సంజీవ్ మేగోటి మాట్లాడారు. ఉత్కంఠ భరితమైన స్క్రీన్‌ప్లేతో సాగే ఈ చిత్రంలో కృష్ణసాయి, బేబీ తనస్వి భిన్న పాత్రల్లో మెప్పిస్తార‌ని అన్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో భయంతో పాటు ఎంటర్టైన్మెంట్ అందిస్తారని చెప్పారు. 45 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి వరలక్ష్మి యే కారణం అని ప్ర‌శంసించారు. తెలుగు, తమిళం, మలయాళం కన్నడం నాలుగు భాషల్లో సినిమాను రూపొందిస్తున్నాం అని వెల్ల‌డించారు ద‌ర్శ‌కుడు.

ప్రధాన పాత్రల్లో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ డైరెక్టర్ చెప్పిన సబ్జెక్టు నచ్చి సినిమా చేశానని అన్నారు. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఫుల్లుగా కామెడీ చేశానని పేర్కొన్నారు. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమా ప్రతీ ఒక్కరికి నచ్చుతుందని చెప్పారు. ఆ న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు. ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వి, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఎస్.ఎన్. హరీష్ సినిమాటోగ్రఫీ, డ్రాగన్ ప్రకాష్–రవితేజ ఫైట్స్ హైలైట్‌గా నిలుస్తాయని తెలిపారు. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది పాత్రలు వారి గత చిత్రాలకు భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు.

అతిథులుగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, హీరో కృష్ణసాయి, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి, అడివి సాయి కిరణ్, రావుల వెంకటేశ్వర రావు ఇతరులు పాల్గొని చిత్ర యూనిట్ కి విషెస్ తెలిపారు.

Related Posts

తెలంగాణ అంటేనే తాగడం – న‌టుడు న‌రేష్

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తెలంగాణ పై నోరు పారేసుకున్నారు. తెలంగాణ అంటేనే తాగ‌డం అని, ఆంధ్ర అంటే విందు చేసుకోవ‌డం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. ప్రతి…

ద‌ర్శ‌న్ క‌న్న‌డ పాలిటిక్స్ లోకి వ‌స్తే బెట‌ర్

బెంగ‌ళూరు : తమిళనాడులో విజయ్ లాగే కర్ణాటకలో దర్శన్ ఉంటారంటూ బాంబు పేల్చారు న‌టి అశ్విని గౌడ . ఇవాళ ప్రాంతీయ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నటుడు సి. జోసెఫ్ విజయ్ బాటలో కన్నడ చిత్ర పరిశ్రమ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *