బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాలి

డిమాండ్ చేసిన బీసీ జేఏసీ వ‌ర్కింగ్ చైర్మ‌న్

న్యూఢిల్లీ : గత రెండు రోజులుగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆందోళన చేపట్టిన బీసీ జేఏసీ నేతలు బుధ‌వారం కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ను కలిశారు. బీసీ డిమాండ్లపై పది నిమిషాలు చర్చించారు . ఈ సందర్భంగా ఐదు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కేంద్రమంత్రికి అందజేశారు ఈ సంద‌ర్బంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు చేసిన పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం డేడికిషన్ కమిషన్ ఏర్పాటు చేసింద‌న్నారు. దాని ద్వారా మొదటిసారి సమగ్ర కులగనన చేపట్టారని తెలిపారు. తదుపరి బీసీ లకు విద్యా , ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో బిజెపి, టీఆర్ఎస్, సిపిఐ, ఎంఐఎం టీజేఎస్ పార్టీల మద్దతుతో ఏకగ్రీవంగా చట్టాన్ని ఆమోదించి ఢిల్లీకి పంపించారని గుర్తు చేశారు .

బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు చెల్లదని న్యాయస్థానాలు అడ్డు పడుతున్నాయని ఆరోపించారు.
సుప్రీం కోర్టు తీర్పు దరిమిలా రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీలులేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టాన్ని ఈ పార్లమెంటు సమావేశాలలోనే రాజ్యాంగాన్ని సవరించి 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని ఆయన కోరారు. టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ తెలంగాణలో అత్యధిక శాతం బీసీ జనాభా ఉన్నా అన్ని రంగాల‌లో అన్యాయం జ‌రుగుతోంద‌ని అన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టానికి టిఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపిందని చెప్పారు.

అసెంబ్లీలో చేసిన చట్టం 8 నెలలు గడుస్తున్నప్పటికీ ఆమోదం పొందడం లేదని అందుకే ఈ పార్లమెంటు సమావేశాలలో టిఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెంటులో ప్రైవేటు బిల్లును ప్రవేశ పెట్టామని చెప్పారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *