ENTERTAINMENT

శ్రీ‌లీల ఐటెం సాంగ్ పై ఉత్కంఠ

Share it with your family & friends

ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన పుష్ప టీం

హైద‌రాబాద్ – డైన‌మిక్ ద‌ర్శ‌కుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ , ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి న‌టించిన పుష్ప 2కు సంబంధించి అప్ డేట్ వ‌చ్చేసింది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి విడుద‌ల తేదీని కూడా ఖ‌రారు చేసింది మూవీ టీం.

సుకుమార్ సినిమాలో ఐటెం సాంగ్ అన్న‌ది కీల‌కం. త‌ను గ‌తంలో ఆ అంటే అమ‌లాపురం సాంగ్ తీశాడు . అది బిగ్ హిట్. ఇదే స‌మ‌యంలో పుష్ప‌లో స‌మంత‌తో స్పెష‌ల్ సాంగ్ చేశాడు. అది సెన్సేష‌న్ సృష్టించింది. కాసుల వ‌ర్షం కురిపించింది. పుష్ప రికార్డుల మోత మోగించింది.

దీనికి సీక్వెల్ గా పుష్ప -2 త్వ‌ర‌లో రానుంది ప్రేక్ష‌కుల ముందుకు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్ర నిర్మాత‌లు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌ముఖ న‌టి శ్రీ‌లీల ఈ చిత్రంలో స్పెష‌ల్ సాంగ్ లో న‌టిస్తుంద‌ని వెల్ల‌డించారు. దీంతో ఫ్యాన్స్ తెగ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. శ్రీలీల పాట‌కు సంబంధించి ఫ‌స్ట్ లుక్ అదుర్స్ అనిపించేలా ఉంది.

కిస్సిక్ పేరుతో విడుద‌ల చేసిన ఈ ఫ‌స్ట్ లుక్ కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు.