టీటీడీ చైర్మన్ తో సుచిత్రా ఎల్లా భేటీ
18న నూతన టీటీడీ బోర్డు సమావేశం
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి నూతన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడుతో బోర్డు సభ్యురాలు సుచిత్రా ఎల్లా భేటీ అయ్యారు. అంతకు ముందు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను కోరుకున్నట్లు తెలిపారు సుచిత్రా ఎల్లా.
ఇదిలా ఉండగా నూతన పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో తొలి కీలక సమావేశం నవంబర్ 18న పాలక మండలి భవన సముదాయంలో జరగనుంది. టీటీడీలో రాజకీయాలు ఎక్కువయ్యాయని, భక్తుల బాగోగులు పట్టించు కోవడం లేదని, స్వామి వారి ప్రసాదంలో కల్తీ చోటు చేసుకుందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఇందుకు సంబంధించి సాక్షాత్తు సీఎం నారా చంద్రబాబు నాయుడే ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విచారణకు ఆదేశించింది. ఇక నూతన సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన సుచిత్రా ఎల్లా చైర్మన్ బీఆర్ నాయుడుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.