జగన్ రెడ్డి రాజీనామా చేస్తే బెటర్
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు . వైసీపీ బాస్ , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది వైసీపీ తీరు అని మండిపడ్డారు.
బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కానీ బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ, వైసీపీ కంటే ముందుగా చెప్పడం జరిగిందన్నారు. తాము చెప్పిందే జగన్ మోహన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ పార్టీకి 38 శాతం ఓట్లు వచ్చినా అసెంబ్లీకి వెళ్లక పోతే ఇక గెలిచి ఎందుకని ప్రశ్నించారు. మీకు మాకూ తేడా ఏమిటని ఎద్దేవా చేశారు.
38 శాతం ఓట్ షేర్ పెట్టుకొని అసెంబ్లీకి పోనీ వైసీపీని నిజానికి ఒక “ఇన్ సిగ్నిఫికెంట్”పార్టీగా మార్చింది జగన్ మోహన్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో అడుగు పెట్టలేని, ప్రజా సమస్యల కోసం సభల్లో పట్టుబట్టలేని, పాలక పక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని ఉండడం ఎందుకు అని ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు.. సొంత మైకుల ముందు కాదు..అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని. మీకు చిత్తశుద్ది ఉంటే.. నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయండని సూచించారు .