జగన్ రెడ్డీ ఇంట్లోనే ఉంటే ఎలా..?
మంత్రి వంగలపూడి అనిత కామెంట్
అమరావతి – ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సీరియస్ కామెంట్స్ చేశారు . మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సెటైర్ వేశారు. ఒక బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధిగా ఎందుకు ప్రజల తరపున మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు.
గురువారం అనిత వంగలపూడి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో జగన్ రెడ్డి ఎందుకు రావడం లేదని మండిపడ్డారు. దీని ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నారని నిలదీశారు వంగలపూడి అనిత.
నిన్న 20 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడారని.. పులివెందుల ఎమ్మెల్యే కూడా వచ్చి మాట్లాడొచ్చు అని కానీ ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్ లు, ఇంట్లో కూర్చుని వీడియోలు ఎందుకు పెట్టాల్సి వస్తోందని అన్నారు.
స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన ఉండి శాసన సభ నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు మీకు మాట్లాడేందుకు మైక్ ఇస్తారని, ఎలాంటి ఆందోళన పడాల్సిన పనిలేదంటూ స్పష్టం చేశారు మాజీ సీఎం జగన్ రెడ్డిని ఉద్దేశించి.
ఇకనైనా పట్టువీడడం ఆపేసి వెంటనే అసెంబ్లీకి రావాలని పిలుపునిచ్చారు వంగలపూడి అనిత.