NEWSANDHRA PRADESH

వేద‌వ‌తి..గుండ్రేవుల‌ను పూర్తి చేస్తాం

Share it with your family & friends

మంత్రి నిమ్మ‌ల రామానాయుడు
అమరావతి -గ‌త ప్ర‌భుత్వం ప్రాజెక్టుల నిర్మాణం గురించి ప‌ట్టించు కోలేద‌ని అన్నారు ఏపీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. శాస‌న మండ‌లిలో ప‌లువురు స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చారు.

కర్నూలు జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తిగా ప్ర‌భుత్వం దృష్టి సారించింద‌ని చెప్పారు. వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి 2019 జనవరి 29 న 1942 కోట్లతో పాలన అనుమతులు ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు.
ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం 4819 ఎకరాలు భూసేకరణ చేయాల్సి వస్తే , వైసిపి కేవలం 9 ఎకరాలు మాత్రమే సేకరించిందని ఆరోపించారు న‌మ్మ‌ల రామానాయుడు.

2019-24 వైసిపి పాలనలో వేదవతి ప్రాజెక్ట్ కు ఒక్కరూపాయు కూడా విడుదల చేయక పోవడంతో మేఘా సంస్థ‌ పనులు నిలిపి వేసింద‌ని తెలిపారు. భూసేకరణకు 384 కోట్లు, సివిల్ వర్క్స్ కు 1456 కోట్లు ఖర్చవుతుందని గుర్తించ‌డం జ‌రిగింద‌న్నారు నిమ్మ‌ల రామా నాయుడు.

గుండ్రేవుల సమీపంలో కోట్ల విజయ భాస్కరరెడ్డి సుంకేశుల బ్యారేజ్ నిర్మాణానికి 2890 కోట్లతో 2019 ఫిబ్రవరి లోనే డీపీఆర్ సిద్ధం అయిందని చెప్పారు. అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ కావడం తో డీపీఆర్ ను తెలంగాణకు పంపంపించిన‌ట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల నుండి మొత్తం 23 వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. ఇదే అవ‌రోధంగా మారింద‌న్నారు మంత్రి.