మహనీయుడు చాచా నెహ్రూ – షర్మిల
జయంతి సందర్బంగా ఘనంగా నివాళి
అమరావతి – ఈ దేశం గర్వించ దగిన మహోన్నత నాయకుడు, దివంగత మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అని కొనియాడారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. నవంబర్ 14న గురువారం నెహ్రూ జయంతి . ఈ సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ దేశ భవిష్యత్తుకు బాటలు వేసిన అరుదైన నాయకుడు నెహ్రూ అని అన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఆయనకు పిల్లలంటే వల్లమాలిన ప్రేమ అని అన్నారు. అందుకే ఆయన పుట్టిన రోజును భారత దేశం యావత్తు జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకోవడం గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తోందని చెప్పారు ఏపీపీసీసీ చీఫ్.
జవహర్ లాల్ నెహ్రూ దేశం గురించి, భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారని కొనియాడారు. యువ, స్వతంత్ర భారతదేశం విధిని రూపొందించిన దార్శనిక నాయకుడి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు.
భారతదేశ మొదటి ప్రధానమంత్రిగా నెహ్రూ వారసత్వం ఎప్పటిలాగే లోతైనది , శాశ్వతమైనది అని అన్నారు షర్మిలా రెడ్డి. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఆధునిక, ప్రగతిశీల దేశం ఆలోచనలపై అతని అచంచలమైన నమ్మకం తరాలకు ఆజ్యం పోస్తూనే ఉందన్నారు.
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూ జీ పాత్ర, నవ భారత నిర్మాణానికి ఆయన అందించిన సహకారం, ముందుచూపుతో కూడిన నాయకత్వం జాతీయ గుర్తింపునకు మూల స్తంభాలుగా నిలిచాయని స్పష్టం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.