భక్తి..యుక్తి..శక్తి ఉంటే విజయం తథ్యం
ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ రవి శంకర్
అమరావతి – ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీశ్రీ రవి శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మంగళగిరి లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ను కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు డిప్యూటీ సీఎం.
ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితం పట్ల నియంత్రణ అనేది ముఖ్యమని స్పష్టం చేశారు ఉత్సాహం, జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తిని పెంచే ప్రక్రియగా సుదర్శన క్రియకు గుర్తింపు ఉందని అన్నారు శ్రీశ్రీశ్రీ రవి శంకర్.
అలాంటి ప్రక్రియను పరోక్షంగా పవన్ కళ్యాణ్ కు ఉపదేశించడం జరిగిందని చెప్పారు. ఈ సందర్బంగా తనకు ఆశీర్వచనం అందజేసినట్లు తెలిపారు శ్రీశ్రీశ్రీ రవి శంకర్.
అనంతరం రవి శంకర్ మాట్లాడుతూ “జీవితంలో విజయం సాధించాలంటే ఏ వ్యక్తికైనా భక్తి, ముక్తి, యుక్తి, శక్తి అనే నాలుగు నైపుణ్యాలు చాలా అవసరం అన్నారు. ఆత్మ బలంతో ధైర్యంగా ముందుకు వెళ్తేనే విజయం వరిస్తుందని చెప్పారు. పరిపాలనలో రాజు ఎప్పుడూ సంతృప్తి చెందకూడదని అన్నారు. సంతృప్తి చెందితే ప్రజలకు మేలు జరగడం ఆగిపోతుంది అని హెచ్చరించారు.