రిమాండ్ రిపోర్టులో ఏముందో తెలియదు
జైలు నుంచి పట్నం లేఖ విడుదల
హైదరాబాద్ – కోడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామస్థులు కలెక్టర్, ఇతర అధికారులపై దాడి ఘటనకు సంబంధించిన కేసు రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అరెస్ట్ అయి చంచల్ గూడ జైలులో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని గురువారం కలుసుకున్నారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు.
ఇదిలా ఉండగా లగచర్ల దాడి ఘటనకు సంబంధించి ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు ఐజీ మహేష్ భగవత్. ఆయనతో పాటు ఐజీపీ వి. సత్య నారాయణ ఇవాళ పరిగి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఇదే సమయంలో దాడికి పాల్పడిన వారు ఎవరైనా సరే వదిలి పెట్టే ప్రసక్తి లేదని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇదిలా ఉండగా తమ విచారణలో కేటీఆర్ పేరు కూడా చెప్పారంటూ కన్వెన్షన్ రిపోర్టులో పోలీసులు పేర్కొనడం కలకలం రేపింది. దీనిపై సీరియస్ గా స్పందించారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. జైలు నుంచే ఆయన లేఖ విడుదల చేశారు. తాను పోలీసులకు ఎవరి పేరు చెప్పలేదన్నారు.
వారిచ్చిన రిపోర్టు తప్పల తడక అంటూ పేర్కొన్నారు. మాజీ మంత్రికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.