గురు నానక్ బోధనలు అనుసరణీయాలు
ప్రధానమంత్రి నరేంద్ర దామోదర మోడీ
ఢిల్లీ – మహోన్నత మానవుడు, ఆధ్యాత్మిక వేత్త శ్రీ గురునానక్ అని కొనియాడారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ. ఆయన జయంతి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ గురునానక్ దేవ్ చేసిన బోధనలు స్పూర్తి దాయకంగా నిలుస్తాయని అన్నారు. ఎక్స్ వేదికగా స్పందించారు ప్రధానమంత్రి.
కరుణ, దయ, వినయం కలిగి ఉండేలా గురు నానక్ బోధనలు బోధిస్తాయని, అవి ఎల్లప్పటికీ తనను గుర్తు చేసుకునేలా చేస్తాయని తెలిపారు పీఎం. అంతే కాకుండా సమాజానికి సేవ చేయడానికి ప్రేరణగా నిలుస్తాయని స్పష్టం చేశారు దామోదర దాస్ మోడీ.
మనుషలంతా ఒక్కటే. సమాజమే దేవాలయం. దయ గలిగిన హృదయమే నిజమైన దైవం అంటూ ప్రబోధించిన గురువు గురునానక్ అంటూ కొనియాడారు పీఎం.
ప్రాపంచిక ప్రేమను కాల్చండి, బూడిదను రుద్దండి. దాని నుండి సిరా చేయండి, హృదయాన్ని కలం గా మార్చండి. ఐశ్వర్యం, అపారమైన ఆధిపత్యం ఉన్న రాజులు, చక్రవర్తులు కూడా దేవుని ప్రేమతో నిండిన చీమతో పోల్చలేరు.
తనపై విశ్వాసం లేనివాడు భగవంతునిపై ఎప్పుడూ విశ్వాసం ఉంచలేడు. మీ స్వంత ఇంటిలో శాంతితో నివసించండి, మరణ దూత మిమ్మల్ని తాకలేరు.