కొలువు తీరిన ఎమ్మెల్సీలు
శాసన మండలిలో ప్రమాణం
హైదరాబాద్ – గవర్నర్ కోటాలో నామినేట్ అయిన ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి, మీర్ అమీర్ అలీ ఖాన్ లు శాసన మండలిలో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ప్రముఖ కవి , రచయిత గాయకుడు గోరేటి వెంకన్నతో పాటు దేశిపతి శ్రీనివాస్ ఉన్నారు.
ప్రమాణ స్వీకారం అనంతరం కోదండరాం , మీర్ అలీ ఖాన్ మాట్లాడారు. పదవి మరింత బాధ్యతను పెంచిందని చెప్పారు. దీనిని బాధ్యతాయుతంగా నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. తమ దైనందిన చర్యలో ఎలాంటి మార్పు అనేది ఉండబోదన్నారు .
తమపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు కోదండరాం, మీర్ అలీ ఖాన్ లు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డికి. అయితే తమ పోరాటం ఆగదన్నారు. తాము ఎల్లప్పటికీ ప్రజల గొంతుకను వినిపించేందుకు ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు.