మహోన్నత మానవుడు గురు నానక్ – సీఎం
ఆయన బోధనలు అనుసరణీయాలు
హైదరాబాద్ – ఏక్ ఓంకార్ సందేశంతో మానవాళికి సమానత్వాన్ని ప్రబోధించిన మహోన్నత మానవుడు, ఆధ్యాత్మికవేత్త గురు నానక్ అని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. శుక్రవారం గురు నానక్ జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
గురునానక్ దేవ్ చేసిన బోధనలు స్పూర్తి దాయకంగా నిలుస్తాయని అన్నారు. కరుణ, దయ, వినయం కలిగి ఉండేలా గురు నానక్ బోధనలు బోధిస్తాయని, అవి ఎల్లప్పటికీ తనను గుర్తు చేసుకునేలా చేస్తాయని తెలిపారు. అంతే కాకుండా సమాజానికి సేవ చేయడానికి ప్రేరణగా నిలుస్తాయని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
మనుషలంతా ఒక్కటే. సమాజమే దేవాలయం. దయ గలిగిన హృదయమే నిజమైన దైవం అంటూ ప్రబోధించిన గురువు గురునానక్ అంటూ కొనియాడారు. మనుషులంతా ఒక్కటేనని, సమాజంలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భావం ఉండ కూడదని బోధించారని తెలిపారు సీఎం.
పరుల పట్ల ప్రేమ భావం కలిగి ఉండాలని, చేతనైనంత మేర సాయం చేయాలని తాను గురు నానక్ బోధనల నుంచి నేర్చుకున్నానని స్పష్టం చేశారు అనుముల రేవంత్ రెడ్డి. నేటి బాల బాలికలు, విద్యార్థులు, యువత గురు నానక్ జీవితాన్ని చదివే ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.